టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి యువతకు ప్రేరణ కలిగించే అంశాలను సోషల్ మీడియాలో తరుచుగా పోస్ట్ చేస్తుంటాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లలో అద్భుత ఫోమ్‌ను కొనసాగిస్తున్న విరాట్ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేశాడు. ఫిట్‌నెస్ కోసం జిమ్ చేస్తున్న దృష్యాలను ఫోస్ట్ చేశాడు. ఏ పని చేసినా ఏదో కష్టపడాలని కాకుండా మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లిని ఆదర్శంగా తీసుకొని మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌లో తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా తీవ్రంగా కృషి చేస్తుంది.
మెరుగైన ఫలితాల కోసం కష్టపడాలి: కోహ్లి