జపాన్‌ కుబేరుడు సంచలన నిర్ణయం

జపాన్‌ కుబేరుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్‌ ఇండస్ట్రీ దిగ్గజం యుసాకు మేజావా తన ఫాలోవర్స్‌కి ఏకంగా రూ. 64.36 కోట్లు పంచిపెట్టడం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం  కలుగుతుంది.  సోషల్‌ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన  తన ట్విటర్‌లో అనుచరులు వెయ్యిమందికి ఈ నగదును పంచిపెట్టనున్నారు. 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా జనవరి 1వ తేదీన ట్విటర్‌లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యిమంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి  9 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ .64.36 కోట్లు) అందజేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్‌ లో రెండవ అతిపెద్ద షాపింగ్‌ సంస్థ జోజో ఇంక్‌ వ్యవస్థాపకుడైన  యుసాకు  చేసిన ఈ ట్వీట్‌  రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల  షేర్లను సాధించింది.  9 లక్షలకుపై పైగా లైక్‌లు కొట్టేసింది. అంతేకాదు జనవరి 7 నాటికి అత్యధిక సార్లు రీట్వీట్‌ అయిన ట్వీట్‌గా నిలిచింది.